రాష్ట్రపతి కి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: రాష్ట్రపతి ద్రౌపదీముర్ము మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం గచ్చిబౌలిలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనడానికి ఆమె హైదరాబాద్‌ వచ్చారు. ద్రౌపదీ ముర్ము హకీంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి సవిూక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking