వడ్డెర సంఘం అధ్యక్షులు కొమ్మర గణేష్ పిలుపు
హైదరాబాద్ జూలై 4 () .బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ జన్మదిన వేడుకలు శ్రీ వెంకటేశ్వర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వడ్డెర సంఘం అధ్యక్షులు కొమ్మర గణేష్ మాట్లాడుతూ విద్య, రాజకీయ, ఉద్యోగ రంగాలలో వెనుకబడిన వడ్డెరలు కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఎస్టీ జాబితా కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు.త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం అధ్యక్షులు కొమ్మర గణేష్, ప్రధాన కార్యదర్శి శంకర్, మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్, గుంజరాజు, కొమ్మెర బాబు, వేముల రమేష్ ,కొమ్మిరి రాములు, సంఘం సభ్యులు కొమ్మరియాదయ్య,నరసింహ, రవి, మహేష్, వేణు, కిష్టయ్య, గబ్బర్, సురేష్, పలువురు యువ నాయకులు పాల్గాయింనారు.