ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 07 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నూతనంగా రూ 25లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రీడింగ్ హాల్ ను మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. దీన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్య క్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ మేయర్ పూనకొల్లు నీరజ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు కార్పొరేటర్ పాలేపు విజయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.