వైభవంగా జరిగిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 07 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ దంసలాపురం లో శ్రీ తిరుపతమ్మ – గోపయ్య స్వామి వార్ల కల్యాణ మహోత్సవం దేవస్థాన వ్యవస్థాపకులు కీ శే కణతాల అచ్చయ్య స్వామి వారి కుమారుడు కణతాల నరసింహరావు ఆధ్వర్యంలో ఎంతో కన్నుల పండుగగా జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ నగర మేయర్ పునుకొల్లు నీరజ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ విచ్చేసి కల్యాణ మహోత్సవం లో పాల్గొని తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి పురోహితుల నుండి ఆశీర్వాద తీసుకున్నారు . ఈ కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఖమ్మం నగరం మరియు చుట్టు పక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కల్యాణం తిలకించారు . విచ్చేసిన భక్తులకు దాతల సహకారం తో దేవస్థాన నిర్వాహకులు అన్నదానం పెద్ద ఎత్తున్న నిర్వహించారు . స్థానిక కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు , బండారు నర్సయ్య , పొన్నం పుల్లయ్య , మండదపు బ్రహ్మారెడ్డి , మందడపు ప్రసాద రెడ్డి , సత్యాల మధు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking