రెజొనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌లో ఘనంగా ‘రెజొ కే.జి. వర్సిటి గ్రాడ్యుయేషన్‌’ వేడుకలు

 

ముఖ్య అతిధిగా పాల్గొన్న ఖానాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీహరి

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 21 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ స్థానిక శ్రీనగర్‌ కాలనీలో గల రెజొనెన్స్‌ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌`డే వేడుకలకు ముఖ్య అతిధి ఖానాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీహరి మరియు రెజొనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌ డైరెక్టర్స్‌ కొండా శ్రీధర్‌ రావు కొండా కృష్ణవేణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి గ్రాడ్యూషన్‌`డే ను ఘనంగా ప్రారంభించడం జరిగింది.
ఈ సంధర్బంగా రెజొనెన్స్‌ చిన్నారులు స్నాతకోత్సవ గౌను తొడుక్కుని, తలపై టోపీలు పెట్టుకుని స్నాతకోత్సవ మందిరంలో వారు హుషారుగా పట్టాలు అందుకున్నారు. కిండర్‌ గ్రాడ్యుయేట్స్‌ వారి ఆట, పాటలతో ప్రాంగణం అంతా పండుగను తలపించేలా చేసి అందరిని ఆనందపరిచారు. వారంతా యు.కె.జి. నుండి 1వ తరగతికి వెళ్ళే చిన్నారులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఖానాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీహరి మాట్లాడుతూ రెజొ కిండర్‌ గార్డెన్‌ వర్సిటి గ్రాడ్యుయేషన్‌ మహోత్సవానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, పిల్లలకు అభినందనలు తెలియజేస్తూ స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకోవడం విద్యార్ధులకు, తల్లిదండ్రులకు తీపి గుర్తుగా ఉంటుందంటూ ఇది వారిలో ప్రేరణను స్పూర్తిని కలిగిస్తుందని రెజొనెన్స్‌ స్కూల్‌ డైరెక్టర్స్‌ విభిన్న కార్యక్రమాలతో పాటు సృజనాత్మకత, మానసిక నైపుణ్యాలను పెంపొందిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ చిన్నారులను మొబైల్స్‌, టి.వి.లకు ఎడిక్ట్‌ కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండడానికి ఆటలు ఆడిరచాలని పిల్లలను ఒత్తిడికి గురిచేయవద్దని చెప్తూ ఈ స్నాతకోత్సవానికి రావటం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులకు అభినందలను, ఆశీస్సులను అందించారు.

డైరెక్టర్‌ కె.శ్రీధర్‌ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులే పిల్లలకు మొదటి ఉపాధ్యాయులు అని, వారు తమ పిల్లల కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కెటాయించాలని, పిల్లలు అడిగే వివిధ ప్రశ్నలకు మనం ఎంతో ఓపికగా సమాధానం చెప్పాలని కోరారు. దానివలన చిన్నారులలో మానసిక ఉల్లాసం పెరిగి చదువుతోపాటు అన్ని రంగాలలో ముందుంటారంటూ నర్సరీ నుండి 10వ తరగతి వరకు అందరి విద్యార్థుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నామంటూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్దే ధ్యేయంగా ప్రణాళికలతో కూడిన భోదన చేస్తూన్నమంటూ వేసవి సెలవులలో విద్యార్థులు తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ విద్యార్థులకు అభినందలను, ఆశీస్సులను అందించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ శ్రీమతి కృష్ణవేణి గారు మాట్లాడుతూ ఇటువంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించడం వలన చిన్నారులకు స్కూల్‌పై, చదువుపై ఆసక్తి కలిగి ఉత్సాహంగా, ఆనందంగా స్కూలుకు వస్తారంటూ వివిధ వేషాదారణలతో వచ్చిన చిన్నారులను ఆశీర్వదిస్తూ ఉపాధ్యాయులను, సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు యం.ప్రసన్నరావు ఉపాధ్యాయులు ఉపాధ్యేయేతర సిబ్బంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking