ప్రజాబలం మంచిర్యాల జిల్లా డిసెంబర్ 30: మంచిర్యాల లోని హమాలివాడ రైల్వే గేటు మూసి వేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది.ఈ మేరకు శుక్రవారం హమాలివాడ రైల్వే గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు.రైల్వే గేటును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ…రైల్వే గేట్ మూసివేయడం వల్ల మంచిర్యాల ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారం భోత్సవం కాకముందే రైల్వే గేట్ మూసివేయడం అన్యాయమని ఆయన అన్నారు.ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు నిర్లక్ష్యం మూలంగానే రైల్వే గేట్ మూతపడి ప్రజలు ఇబ్బందులు పడడానికి కారణమవుతుందని ఆయన ఆరోపించారు.రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించవలసి ఉండగా అధికారులతో చర్చించి మెప్పించలేక అండర్ బ్రిడ్జి నిర్మాణం జరుపుకోవాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు.ఇప్పటికే వర్షాకాలంలో అండర్ బ్రిడ్జ్ లో నీళ్లు నిలిచి రాకపోకలు నిలిచిపోయాయని భవిష్యత్తులో ఈ అండర్ బ్రిడ్జి వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఉపయోగపడదని ఆయన తెలిపారు.రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణమే ఈ ప్రాంత ప్రజల రవాణా సౌకర్యానికి పరిష్కార మార్గం అవుతుందని ఆయన అన్నారు. అనంతరం మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు మజీద్ మాట్లాడుతూ… టూ టౌన్ పట్ల ఎమ్మెల్యే దివాకర్ రావు వివక్షత చూపుతున్నాడని ద్వజమెత్తారు.రైల్వే ఓవర్ బిడ్జి నిర్మించేందుకు ప్రతిపాదనలు రాగా బడా వ్యాపారవేత్తల వ్యాపారం ఇండ్లకు నష్టం జరుగుతుందని ఉద్దేశంతో ఆ ప్రతిపాదనకు చరమగీతంపాడారని ఆయన అన్నారు.రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిపి తీరవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.అలాగే 60 ఫీట్ల రోడ్డు వెడల్పు పేరుతో ఇల్లు కూల్చివేసిన అధికారులు ఇప్పటివరకు పనులు చేపట్టలేదని ఆయన మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్, యువజన కాంగ్రెస్ నీయోజకవర్గ అధ్యక్షులు కౌన్సిలర్ సళ్ళ మహేష్ , మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, కౌన్సిలర్స్ కొండ పద్మ, జోగుల శ్రీలత,పుదారి సునీత, పట్టణ ఉపాధ్యక్షులు సదానందం, గండ్ల సత్తమ్మ,లావణ్య,లలిత, సరస్వతి,వీరచారి,శంకర్, బోయపోతుల తిరుపతి,తిరుపతి, ప్రకాష్,సురేష్,రమేష్,రఫీషకీల్, ఫర్వెజ్,అంజద్,ప్రేమ్,బద్రి ప్రకాష్, ప్రేమ్,సాయి,వెంకటేష్, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.