ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 23 (ప్రజాబలం) ఉమ్మడినల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే బేషరతుగా ఎత్తివేయాలని ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్యయాదవ్,జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారి సింహాద్రి యాదవ్ డిమాండ్ చేశారు
ఈరోజు నల్గొండ జిల్లా సూర్యాపేటలోని జానయ్య యాదవ్ నివాసముకు వెళ్లి వారి సతీమణి మరియు వారి అమ్మ గారిని కలిసి పరామర్శించారు. బీసీ కులాలలో ఐక్యత లేకపోవడం వలన అగ్రకులాల ఆధిపత్యం చలామణి అవుతుందని, మొన్నటి వరకు అధికార పార్టీ దృష్టిలో వట్టె జానయ్య యాదవ్ చాలా మంచివాడని, నాక్కూడా ఎమ్మెల్యే సీటు కావాలని అనడంతో ఇప్పుడు అధికార పార్టీ దృష్టిలో చెడ్డవాడిగా ఇన్ని కేసులు పెట్టడం జరిగిందని, ఎమ్మెల్యేగా కావాలని కోరుకోవడం తప్పా?కురుమ యాదవులకు, బహుజనులకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులు రాజకీయంగా అభివృద్ధి చెందాలని, మీ హక్కులు మీరు సాధించుకోవడం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారని అలాంటప్పుడు మంచి చురుకైన బి. ఆర్. ఎస్ పార్టీ నాయకుడి పై ఇలాంటి కేసులు పెట్టి హింసించడం చాలా దుర్మార్గమని, ఈ సంఘటన వల్ల యాదవులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఒట్టే జానయ్య భార్య రేణుక,తల్లి అయిలమ్మ, యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రాంచందర్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్, అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్, బండారు ప్రభాకర్, శేఖర్, మురళి, ప్రవీణ్, రాజశేఖర్, మరి మేకల కోటయ్య, సత్తి వెంకన్న తదితరులు పాల్గొన్నారు