ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 17 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాయల్ నాగేశ్వరావు నేలకొండపల్లి విలేకరుల ఆత్మీయ సమ్మేళనం వెంకటాపురం ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ ఆత్మీయ సభలో రాయల మాట్లాడుతూ నేను పాలేరు నియోజకవర్గం వాడినని గతంలో జరిగిన పాలేరు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు విజయం సాధించిందని కమ్యూనిస్టు రెండుసార్లు విజయం సాధించాలని బి ఆర్ ఎస్ ఉప ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించిందని కొందరు ఆత్మీయ సభలో మాట్లాడుతూ వారు వన్ సైడ్ అని అంటున్నారు కానీ నేను మాత్రం ఒకటే అంటున్న వారు వన్ సైడ్ అది కాంగ్రెస్ సైడ్ అని అన్నారు నేను గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి సుమారు 20,000 ఓటు సాధించారని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో లో విలీనం చేసిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అని అధిష్టానం ఆదేశిస్తే పాలేరు నుంచి నేను పోటీ చేస్తానని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆదరించిన వాళ్ళందరూ నన్ను ఆదరిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పాలేరు సేవాదళ్ కన్వీనర్ బచ్చల కూర నాగరాజు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు ఎడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు