ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఐకెపి వివొఏ ఉద్యోగస్తులు నిరవధిక సమ్మె

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఐకెపి వివొఏ ఉద్యోగస్తులు నిరవధిక సమ్మె

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 17 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏ (సీఐటీయూ) ఉద్యోగస్తులు నిరవధిక సమ్మె శిభిరాన్ని సందర్శించి,సమ్మెలో కూర్చున్న నాయకులకు పూల దండాలు వేసి సమ్మెను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి వివోఏల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం.ఈ రాష్ట్రంలో మంత్రులకు,ఎమ్మెల్యే లకు జీతాలు పెంచిన ప్రభుత్వం.వీవోఏలకు జీతాలు ఎందుకు పెంచడం లేదో అర్థం కావడం లేదు.ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సోమవారం నుండి ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలపునివ్వడం జరిగింది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించాలి.వీవోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి,కనీస వేతనం చెల్లించాలి.లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో శోభా సీఐటీయు మండల కన్వినర్,సమ్మెకు మద్దతు తెలిపిన పి డి ఎస్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల తిరుపతి,తుడుందెబ్బ సంఘం మండల అధ్యక్షుడు సూరి పటేల్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు అడ్లురి హరీష్ కుమార్,ఐకెపి వివోఏ జిల్లా గౌరవ అధ్యక్షులు లింగంపల్లి వేంకటేష్,ఐకెపి వివోఏ జిల్లా కోశాధికారి దుర్గం రాములు,అనిత నియోజకవర్గం అధ్యక్షురాలు శారద మండల అధ్యక్షురాలులావణ్య,శేష,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking