ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 27:
మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ఆటపాటను సోమవారం బి జోన్ రాజీవ్ చౌక్ సూపర్ బజారు ఏరియాల్లోని ప్రజలకు వాహన దారులకు అవగాహన కలిగించారు. వాహనదారులందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని వేగాన్ని అదుపులో ఉంచి బండి నడపాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని వివరించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని మైనర్స్ కు వాహనాలు ఇవ్వకూడదని రోడ్డు భద్రత నియమాలను పాటించి సురక్షితమైన గమ్యాన్ని చేరుకోవాలని ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించారు. ఈకార్యక్రమంలో సారధి కళాకారులు టీం లీడర్ ముల్కల మురళి, సభ్యులు కొప్పర్తి రవీందర్, వెల్తురు పోశం, వరకపురం రవికుమార్, బీరుపూరి శ్రీనివాస్, కాసిపేట సంతోష్, వావిలాల నాగలక్ష్మి, చేగుంట నిరోషా, ప్రజలు పాల్గొన్నారు.