హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 27
జమ్మికుంట మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ పోనగంటి రాము కు వార్డు ప్రజలు మాజీ ప్రజాప్రతినిధులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి కాంశెట్టి మల్లయ్య మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ గా సేవలందించి ప్రజల మననలు పొందారాని వార్డు అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నాడని కొనియాడారు. తన వార్డులో ప్రతి గల్లీలో సిసి రోడ్లు,డ్రైనేజీలు, నిర్మించి, త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చి సౌకర్యం కల్పించారు. మోత్కూలగూడెం గ్రామానికి సంబంధించిన వైకుంఠధామం వెళ్లడానికి గతంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని దాన్ని దృష్టిలో పెట్టుకొని సిసి రోడ్డు నిర్మాణం కోసం 35 లక్షల రూపాయలు మున్సిపాలి నుండి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేపించుకొని సీసీ రోడ్డు వేసి ప్రజల సౌకర్యార్థం కోసం తీసుకొచ్చారని అన్నారు. ఐదు సంవత్సరాలుగా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతో సేవ చేశారాని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమం లో పొనగంటి కొమరయ్య, పొనగంటి శ్రీధర్, కాసర్ల సతీష్, జెమిని సురేష్, సతీష్, సురేష్, రాజు ,రాము, విష్ణువర్ధన్, వార్డులోని యువకులు ప్రజలు పాల్గొన్నారు.