ప్రజావాణికి 38 దరఖాస్తులు.
నాలుగు పథకాల విజయవంతంగా అమలకు అధికారుల కృషి ప్రశంసనీయం.
గ్రామసభల నిర్వహణలో
ప్రజల సహకారం పై హర్షం వ్యక్తం.
శ్రీ మేడారం సమక్క సారలమ్మ చిన్న జాతరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి.
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ప్రజా బలం ప్రతినిధి 27 జనవరిములుగు జిల్లా. పెండింగ్ లో ఉన్న ప్రజావాణి అర్జీలను వచ్చే వారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 38 మంది తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అట్టి అర్జీలను సత్వరమే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను అయన ఆదేశించారు.ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 38 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 08 గృహ నిర్మాణ శాఖకు 07, పెన్షన్ 01, ఉపాధి కల్పనకు 02 ఇతర శాఖలకు సంబంధించినవి 20 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు
అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ
జిల్లాలో ప్రతిష్టాత్మక నాలుగు పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మరియు నూతన రేషన్ కార్డులు జారీ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములైన గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం సేవలను అభినందనియమన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాలకు లబ్ధిదారుల ఎంపికకై ఈ నెల 16 నుండి 20 వ తేదీ వరకు క్షేత్రస్థాయి విచారణ, 21 నుండి 24 వరకు గ్రామసభలు నిర్వహణలో ప్రజల సహకారం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ప్రభుత్వ ఆశయం మేరకు ప్రతి ఒక్కరి ఉద్యోగి కృషి ప్రశంసనీయమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన పేదలకు అందించడంలో స్ఫూర్తితో పనిచేయాలని ఆయన సూచించారు. సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతరం ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందచేయుటలో ఒక టీముగా
ప్రతి ఒక్కరు ఐకమత్యంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఉద్యోగి సేవాకాలంలో పేదలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజల మన్ననలు పొందాలని, అదే ప్రతి ఉద్యోగికి ఆశీర్వాదమని తెలిపారు.
ఫిబ్రవరి 12 నుండి 15 వరకు జరిగే
శ్రీ సమ్మక్క సారలమ్మ చిన్న జాతరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి జాతర విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.