ప్రమాదవశాత్తు గాయపడిన జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

 

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 27

ప్రమాదవశాత్తు గాయపడి క్షతగాత్రునిగా మిగిలిన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్న రాత్పల్లి గ్రామానికి చెందిన బందేల రాజశేఖర్ (మనం దినపత్రిక పెద్దపల్లి స్టాప్ రిపోర్టర్ )ఈనెల 4వ తారీఖు నా విధులు నిర్వర్తించుటకు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోకి వెళుతుండగా తన ద్విచక్ర వాహనం నుండి క్రిందపడి తీవ్ర గాయాలు అవడంతో శస్త్ర చికిత్స ద్వారావైద్యులు ఆయన కుడి కాలు తొలగించారు .విషయం తెలుసుకున్న హుజురాబాద్ నియోజకవర్గం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహాన్,ఏబూసి సంపత్, ఆధ్వర్యంలో రాజశేఖర్, కుటుంబానికి ఆదివారం రోజున ఆర్థిక సహాయాన్ని అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు .ఆ తర్వాత ఎస్ ఆర్ కే డైరీ చైర్మన్ బండారి మారుతి కూడా తమ సంస్థ ద్వారా గాయపడిన జర్నలిస్టు కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు .ఫోన్ ద్వారా క్షతగాత్రుడిని పరామర్శించిన మారుతి మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ జర్నలిస్టుకు ఏ ఆపద ఎదురైన అందుబాటులో ఉండి ఆదుకుంటానని హామీని ఇచ్చారు.అనంతరం టిడబ్ల్యు జెఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉండి తోడ్పాటు అందించాలని అలాగే జర్నలిస్టు సంఘాలు కూడా శక్తి వంచన లేకుండా ఆర్థిక సహాయాన్ని అందించి చేయూతనివ్వాలని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులతోపాటు జాయింట్ సెక్రటరీ ఖాజా ఖాన్ సంఘం సభ్యులు వలిపిరెడ్డి శ్రీనివాస్, ఎండీ రఫీక్,రచ్చ రవి కృష్ణ, లతోపాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking