ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 12 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట విద్యార్థులు ఓటర్ నమోదులో భాగస్వాములవ్వాలి మంచిర్యాల ఆర్డీఓ రాములు అన్నారు.బుధవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కాలేజ్ లో విద్యార్థులకు’ సిస్టమాటిక్ ఓటర్శ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్’ (స్వీప్) ప్రోగ్రామ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాములు మాట్లాడుతూ… మహిళలు,యువత, విద్యావంతులు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఓటింగ్ శాతం పెంచడంలో యువత అన్ని స్థాయిల వారికి ఓటు ప్రాముఖ్యతను గురించి వివరించి,ఓటింగ్ శాతం పెంచాలని కోరారు.వచ్చే అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని, సంబంధిత బీ ఎల్ ఓ లు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఓటర్ నమోదు ఫారంలతో పాటు ఓటు వలన ప్రజాస్వామ్యం ఎలా ఫరిడవిళ్ళుతుందో ఆయన వివరించారు.
అంతకుముందు తహసీల్దార్ రాఘవేంద్ర రావు మాట్లాడుతూ…దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కును కల్పించారని తెలిపారు.ఆర్టికల్ 324 ద్వారా ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఓటర్ నమోదు,ఓటు అవశ్యకత ప్రక్రియ గురించి వివరిస్తుందని తెలిపారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటర్ గా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.అంతేకాకుండా విద్యార్థులు ఇతరులకు ఓటు విలువ తెలియజేయాలనీ,బీ ఎల్ ఓ ల సేవలు వినియోగించుకోవాలని కోరారు.కళాశాలలో బీ ఎల్ ఓ లు విద్యార్థుల ఓటర్ నమోదు ప్రక్రియను చేపడుతున్నట్లు వివరించారు. ఆన్లైన్ లో కూడ నూతన ఓటర్ నమోదు,మార్పులు, చేర్పులు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి,ఎంఈఓ రవీందర్ లు ఓటు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అంతకుముందు విద్యార్థులు ఓటు సద్వినియోగంపై నాటికను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువపై పలువురు విద్యార్థులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా,అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.