మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 13(ప్రజాబలం):
ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కొత్త గూడ మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రెండు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీ శ్రీమతి మలోత్ కవిత, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు.
ఈయొక్క కార్యక్రమం మండల అధ్యక్షులు కొమ్మరా బోయిన వేణు,ఏర్ప సూరయ్య ఆధ్వర్యంలో జరగగా రెండు జిల్లాల అధ్యక్షులు ఎంపీ కవిత, లక్ష్మన్ బాబుతో పాటుగా ములుగు జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగజ్యోతి పాల్గొన్నారు.
కార్యకర్తలు గత ఎన్నికలలో ఎమ్మెల్యే ఓడిపోయి ఎన్ని బాధలు పడ్డారో స్వయంగా చూశాను.
మళ్ళీ మనం అటువంటి పరిస్థితి లలోకి వెళ్లకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.
గులాబీ జెండా ఎత్తిన ప్రతి ఒక్కరినీ నేను నా కుటుంబ సభ్యులతో పాటుగా ఎల్లవేళలా తోడుగా ఉంటాను అని హామీ ఇచ్చారు.