చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు కటకం రమేష్ విరాళం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 13 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట లోని కరీంనగర్ చౌరస్తా వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి కటకం రమేష్ తన వంతు సహాయంగా రూ.10,016/- అందజేశారు. బుధవారం స్థానిక హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్,శివాజీ విగ్రహ ఏర్పాటు కమిటీకి ఆయన ఈ విరాళం ఇచ్చారు.ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్ మాట్లాడుతూ…హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేసిన చత్రపతి శివాజీకి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. న్యాయం కోసం ఏనాడు రాజీ పడని శివాజీ నాయకత్వం ఇప్పటికీ ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన మహనీయుని విగ్రహ ఏర్పాటుకు దాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో శివాజీ విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు రవి గౌడ్,దిలీప్,రమేష్,వెంకటేష్,ఉమేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking