మధ్యాహ్న భోజన ఏర్పాట్లు

రాజేంద్ర నగర్‌ ప్రజా బలం ప్రతినిధి 13 సెప్టెంబర్‌ 2023: మణికొండలో గల కొంత మంది స్నేహితులు వారికీ పరిచయమున్న సహచరులతో భాగస్వాములై కలసి స్వయముగా స్వంత నిధులు చిన్న మొత్తాలను కూడబెట్టి మొదలెట్టిన సహయోగ్‌ సంస్థ ఆధ్వర్యంలో నరేశ్‌ మరియు నిర్మల్‌ గొలేచ సహకారాలతో మంగళవారం సెప్టెంబర్‌ 12న హైదరబాద్‌ నడిబొడ్డున కల ప్రముఖ వ్యాపార కూడలి అయిన పాత ఉస్మాన్‌ గంజ్‌ లో గల భాగ్యనగర్‌ అయ్యప్ప సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల్యం చెయిల్డ్‌ కేర్‌ అనే పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే సంస్థలో ఉన్న పిల్లలకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయడం జరిగినదనీ సంగసభ్యుడు అందె లక్ష్మణ్‌ రావు తెలియ జేసినారు, ఇదియే కాకుండ ప్రస్తుత శ్రావణ మాస కృష్ణాష్టమి రోజున ఇస్కాన్‌ టెంపుల్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న రోజువారీ భోజన పథకంలో తమ వంతుగా వంద మందికి భోజన ఏర్పాట్లకు సరిపడా ఆర్థిక సహాయం చేయడమైనది మరియు ఈ నెల 11న శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్దాశ్రయంలో సేద తీరుతున్న వారికీ సాదు నాగేంద్ర సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడ మైనదనీ తెలియజేస్తూ మణికొండ ప్రభుత్వ పాఠశాలలోనే అత్యుత్తమంగా ఉత్తీర్ణురాలైన కుమారి వీ. మహేశ్వరినీ చైతన్య జూనియర్‌ కాలేజిలో చదువించటానికి దిలీప్‌ కక్కడ్‌ మరియు ఇతరులు వారి వారి సహాయ సహకారాలను అందజేయడం జరిగిందనీ తెలియ పరచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking