అంతర్జాతీయ స్థాయి ప్రజోపయోగ ప్రాజెక్టులలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరో ప్రయోగం
అహమ్మదాబాద్ నుంచి దక్షిణంగా ముంబయ్ వైపు బయలుదేరిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ వేగం పుంజుకుంటోంది. ఇంజన్ లోపల ఉన్న గదిలో విద్యుత్ డిస్ ప్లేలో అది గంటకు 120 కిలోమీటర్లు దాటుతున్నట్టు చూపుతోంది. స్టేషన్ దాటి అప్పటికి కొద్ది నిమిషాలే గడిచింది. స్వదేశీ పరిజ్ఞానంతోనే దాని డిజైనింగ్, ఇంజనీరింగ్, నిర్మాణం పూర్తయ్యాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం నినదిస్తున్న ‘మేకిన్ ఇండియా’ పారిశ్రామిక విధానానికి ఇది నిదర్శనం. మైక్రో చిప్ మొదలుకొని యుద్ధ హెలికాప్టర్ల దాకా అన్నీ స్వదేశంలోనే తయారు కావాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. స్వదేశీ పరిజ్ఞానం వాడుకుంటూ, విదేశీ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంటూ ముందుకు సాగాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
“సాంకేతిక భాగస్వాములను వాడుకుంటూ భారతదేశంలోనే నూటికి నూరుశాతం తయారు చేయటానికి ప్రయత్నిస్తున్నాం.” అన్నారు గుజరాత్ లోని అహమ్మదాబాద్ కు చెందిన సీనియర్ రైల్వే ఉద్యోగి సౌరభ్ సింగ్. “ఉత్పత్తి స్వదేశీ, డిజైన్ స్వదేశీ – కానీ ప్రపంచంలోని మిగిలిన రైళ్ళన్నిటికంటే మెరుగ్గా ఉంటుంది” అన్నారు. ముందు వైపు సూటి ముక్కుతో ఉండే ‘వందే భారత్’ లాంటి రైళ్ళు జర్మనీ, జపాన్, చైనా లాంటి దేశాలలో కొత్త కాకపోవచ్చు. కానీ ప్రపంచపు అతిపెద్ద హైస్పీడ్ రైళ్ళ నెట్ వర్క్ ఉన్న భారత్ కి మాత్రం ఇది ప్రత్యేకమే. అనేక లక్షణాలు భారత్ కు కొత్తే.
వందే భారత్ ట్రాక్ 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకోగలుగుతుంది. అయితే, బులెట్ స్పీడ్ రైళ్ళ వేగమైన గంటకు 200 కిలోమీటర్ల కంటే తక్కువే. అందుకే వందే భారత్ ను ఇక్కడి అధికారులు సెమీ హైస్పీడ్ రైలుగా అభివర్ణిస్తుంటారు. అయితే, భారత్ లో ఈ మాత్రపు వేగం కొంత అసాధారణమే. చాలా సందర్భాలలో పశువులు డీకొట్టి ప్రమాదాలు జరిగాయి. అందుకే అధికారులు కొన్ని చోట్ల రైలు మార్గం పక్కన కంచె నిర్మించాల్సి వస్తోంది.
ప్రయాణీకులకు మాత్రం వందే భారత్ ఎక్స్ ప్రెస్ బాగా నచ్చింది. అందుకే పెద్ద సంఖ్యలో ఈ రైల్లో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. మొదటి ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను మోదీ నవంబర్ లో బెంగళూరు లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ మధ్యనే కొత్తగా బెంగాల్ లో ప్రారంభించిన రైలుతో కలుపుకొని ఇప్పటిదాకా ఏడు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇంకొన్ని రైళ్ళు కూడా ప్రారంభం కాబోతున్నాయి.

అహమ్మదాబాద్, సూరత్ మధ్య ప్రయాణించే 28 ఏళ్ల సివిల్ ఇంజనీర్ వినయ్ ప్రభాకర్ ఈ మధ్యే వందే భారత్ ఎక్స్ ప్రెస్ గురించి టీవీలో చూశానన్నాడు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా ప్రారంభించినట్టు తెలుసుకున్నానంటున్నాడు.
భారతీయ ఇంజనీర్లు సాఫ్ట్ వేర్ డిజైనింగ్ లోనూ, భారీ యంత్రాల తయారీలోనూ, ఫార్మా రంగంలోనూ ప్రపంచ మార్కెట్ లో ఇప్పటికే పేరు మోశారు. భారతదేశం ఇప్పుడిప్పుడే ఈ ప్రైవేట్ రంగపు నైపుణ్యాన్ని రైల్వేల వంటి తక్కువ సామర్థ్యం ఉన్న రంగాలో కూడా వాడుకోవటానికి సిద్ధమైంది. ఈ రైలు భారతదేశపు పారిశ్రామిక నమూనాకు ఉదాహరణ. తక్కువ ఖర్చులో అత్యాధునికంగా తయారుచేయటమనే చైనా వారి విధానానికి సరైన పోలిక ఇది.
”స్వదేశంలో డిజైన్ చేసి స్వదేశంలోనే తయారయ్యే అత్యాధునిక రైలు కావాలని ప్రధాని మాకో సవాలు విసిరారు.” అన్నారు భారత రైల్వేలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ సవాలును ఇంజనీర్లు సమర్థంగా నెరవేర్చారన్నారు. ఇప్పుడు భారత్ లో ఈ రైలు ఎగుమతి ప్రమాణాలకు తగినట్టు తయారావుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2021 లో భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్నీ 75 వందే భార రైళ్ళతో అను సంధానం చేస్తామన్నారు. న్యూ ఢిల్లీలో కూడా భారతీయ రైల్వేలు విక్టోరియా కాలం నాటి రైల్వే స్టేషన్లను, లెవెల్ క్రాసింగులను, ఇతర మౌలిక సదుపాయాలను మార్చటానికి రంగం సిద్ధమైంది.
ఆహమ్మదాబాద్, ముంబయ్ మధ్య తరచూ ప్రయాణించే 32 ఏళ్ల కంప్యూటర్ నిపుణుడు శుభమ్ రాయ్ మొదటిసారిగా ఆ రైల్లో ఎక్కగానే సెల్ఫీ తీసుకున్నాడు. ఇప్పుడు రెండో ట్రిప్పులో ఉన్నారు. “ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా. ఇలాంటి రైళ్ళు మరిన్ని రూట్లలో కూడా ఉంటే బాగుంటుంది. జనానికి చాలా సమయం ఆదాయ అవుతుంది” అంటున్నారు.