వైయస్సార్ తెలంగాణ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులుగా సయ్యద్ హాది.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన సయ్యద్ హాది వైయస్సార్ తెలంగాణ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులుగా నియామకం చేస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల నియామక పత్రం అందజేశారు. గతంలో లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులుగా,జిల్లా కార్యవర్గ సభ్యులుగా,పని చేసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీకి చేసిన సేవలను గుర్తించి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించినట్లు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ బెజ్జంకి అనిల్ కుమార్ పేర్కొన్నారు.. ఈ సందర్భంగా సయ్యద్ హాది మాట్లాడుతూ….పార్టీ కి చేసిన సేవలను గుర్తించి,తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు,రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తానని,ఈ అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల,ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ బెజ్జంకి అనిల్ కుమార్ కి, దుర్గం నగేష్ కి మంచిర్యాల నియోజకవర్గం కోఆర్డినేటర్ కారుకూరి సురేందర్ ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking