ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28 : విద్యార్థుల్లో మేధాశక్తిని పంపించడానికి సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని ప్రిన్సిపల్ గౌతం కుమార్ రెడ్డి తెలిపారు. జాతీయ సైన్స్ ఫెయిర్ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో సైన్స్ ఫెయిర్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి యొక్క సాంకేతిక విజ్ఞానంతో తయారుచేసిన పలు ప్రయోగాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యను శ్రద్ధగా నేర్చుకుని భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులు తయారుచేసిన పలు ప్రయోగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత మూడు రోజులుగా విద్యార్థులు సైన్స్ ఫెయిర్ దినోత్సవం కోసం ఎంతగానో శ్రమించి వారి యొక్క విజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించి ప్రయోగాలు చేసేందుకు సంబంధిత ఉపాధ్యాయుల కృషి అభినందనీయం అన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అలాగే మండలం తో పాటు దండేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్ దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏటీపీ స్వప్న కుమారి ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.