ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 12 :మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి నర్సాపూర్, అందుగులపేట పొలాలకు పోయే రైతులకు వెల్గనూరు నుండి అందుగులపేట నర్సాపూర్ పొలాలకు పోయే రైతులకు(త్రోవ)బాట సక్రమంగా లేక గుంతలు గుంతలుగా ఉన్నందున అట్టి రోడ్డుకు అనగా వెల్గనూరు గ్రామంలోని బీసీ కాలనీ ప్లాట్ల నుండి బంగారు కిత్త మోరి వరకు మా సొంత ఖర్చులతో రోడ్డు పైన మొరంపోసి సమానంగా నేర్పించడం జరిగింది.దీనికి తాజా మాజీ సర్పంచ్ బిల్లుకూరి శంకరయ్య,గోపతి రాజయ్య, కాండ్రపు లక్ష్మణ్, జెసిబి బత్తుల శేఖర్,పంచేరుపుల సత్తయ్య,గడికొప్పుల తిరుపతి,బిల్లకూరి మహేందర్,అలిశెట్టి ప్రవీణ్,అక్కల జగన్, టాక్టర్లతో రోడ్డుపై మొరంపోసి నేర్పించడ మైనది.