సికింద్రాబాద్ ప్రజాబలం ప్రతినిధి: వర్క్ షాప్స్ డివిజనల్ ఆఫీస్, లాలాగూడ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సామాజిక ఉద్యమకారులు.. మేధావి..
శ్రీ పాశం యాదగిరి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది. బీసీ సమాజం నుండి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు బీసీ ల సామాజిక, స్థితిగతులపై అవగాహన పెంచుకోవాలన్నారు.
ఈ దేశం లో 3 వేల ఓబీసీ కులాలు ఉన్నాయని…
వాళ్ళు ఈ దేశం లో శ్రమజీవులుగా,సంపద సృష్టికర్తలుగా మిగిలిపోతున్నారే తప్ప..పాలకులు కాలేక పోతున్నారు..
ఇప్పటికైనా బీసీ లు మేల్కోవాలి..
ఈ దేశ మూల వాసులుగా ఉన్న బీసీ తమ చరిత్ర తెలుసుకోవాలి..
రాజ్యాధికారం,
రాజ్యాంగ అధికారం సాధించి కోవటం కోసం బీసీ లు ముందడుగేయాలన్నారు..

‘‘ఓబిసి మేలుకో..
నీ రాజ్యం ఏలుకో’’ అంటూ ఈ వేదిక ద్వారా నినదించారు..
అనంతరం ఓబిసి ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ప్రెసిడెంట్గా శ్రీ చంద్రమౌళి గారు జనరల్ సెక్రటరీగా శ్రీ బీవీఎన్ సత్యనారాయణ ట్రెజరర్ గా నర్సింగరావు మరియు ఇతర కార్యవర్గ సభ్యుల ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. జనరల్ సెక్రెటరీ
శ్రీ బీ.వి.ఎన్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ 2016 నుండి ఓ బి సి ఎంప్లాయిస్ అసోసియేషన్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అని.. కుల,మాతాలకతీతంగా ఎంతోమంది మన దృష్టికి వచ్చిన ఎంతోమంది ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేశామన్నారు.
ఈ కార్యవర్గంలో ఎక్కువ బీసీ కులాలకు సంబంధించిన వారికి ప్రాతినిధ్యం లభించిందన్నారు. బ్రాంచీలు, డివిజన్లు వారి వారి పరిధిలో అసోసియేషన్ అభివృద్ధి కోసం పని చేయాలి అన్నారు. అలాగే మన వెనుక ఉన్న సమాజానికి కూడా మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేశారు.. ప్రెసిడెంట్ శ్రీ చంద్రమౌళి గారు మాట్లాడుతూ అన్ని రకాల ఈ అసోసియేషన్ ముందుకు వెళ్లడానికి కృషి చేస్తాను అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నాయకులు శ్రీ జమలయ్య గారు మాట్లాడుతూ.. ఉద్యోగులు చేసే ఉద్యమాలకు రైతాంగం వైపు నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుందని, బాధ్యతతో పని చేస్తూనే..
హక్కులు సాధించుకోవటానికి ముందుకు రావాలని కోరారు..
మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే ఎన్‌ఎం లోకండే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లా విగ్రహాలకు పూలమాలలు వేసి.. జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైన ఈ సమావేశం లో.. వివిధ బ్రాంచ్ ల, డివిజన్ ల నాయకులు, ఓబిసి ఉద్యోగులు పాల్గొన్నారు.కె.బలరాంలు వైస్ ప్రెసిడెంట్ డివిజన్ వర్క్ షాప్ , ఎల్‌ఎస్‌ఆర్‌కె ప్రసాద్ స్క్రోబిసియా డివిజన్ వర్క్‌షాప్ ప్రెసిడెంట్, సంతోష్, స్క్రోబిసియా, ప్రెసిడెంట్, ముఖ్య అతిథి శ్రీ పాశం యాదగిరి, బివీఎన్ సత్యనారాయణ స్క్రోబీసీ జనరల్ సెక్రటరీ మరియు స్క్రోబిసియా యాదగిరి డివిజన్ సెక్రటరీ వర్క్‌షాప్ తదితరలు పాల్గోన్నారు.