హుజురాబాద్ ‘రెడ్డి’ ఇన్ .. పెద్దపల్లి ‘రెడ్డి’ డౌట్ .!

దాసరి’ జాతకం’ఇలా తిరగబడుతుందా?

కలవరం పుట్టించిన కేటీఆర్ మాటల మర్మం.

పెద్దపల్లి ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 2÷

—-రాజకీయాలు ఎప్పుడు ఏ మూలమలుపులు తిరుగుతాయో? ఎవరి జాతకం తిరగబడుతుందో ఎవరి అదృష్టం కలిసి వస్తుందో పార్టీ పెద్దలకు.. కాలానికి మాత్రమే తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ నోట వచ్చిన ఒక్క మాట నూరు అర్థాలకు జవాబుగా మారింది. ఉమ్మడి జిల్లా నుండి ఏకైక రెడ్డి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డికి టిఆర్ఎస్ లో రెడ్డిల తరఫున ప్రాతినిధ్యమయించే రెడ్డి శాసనసభ్యుడిగా పేరు ఉన్నది. గత ఎన్నికల సమయం నుండి బిఆర్ఎస్ నాయకత్వం ప్రత్యామ్నాయ రెండో రెడ్డి తలకాయ కోసం పార్టీ వెతుకుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. హుజరాబాద్ లో కౌశిక్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో అప్పటినుండే దాసరి మనోహర్ రెడ్డి పేరు మసకబారుతుంది. దీనికి తగ్గట్టుగా…

మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ o పర్యటనలో భాగంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు రాజకీయ వాక్యాలతో ఆ నియోజకవర్గ రాజకీయాలు మలుపు తిరిగాయి. అభివృద్ధి పనులలో భాగంగా ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రి కేటీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో హుజురాబాద్ నియోజకవర్గం నుండి పాడి కౌశిక్ రెడ్డి శాసనమండలి సభ్యులు ఈటల రాజేందర్ తో శాసనసభ్యుడిగా తలపడనున్నారని చెప్పకనే చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో సభా ప్రాంగణమంతా మార్మోగింది. సభా వేదిక పైన గత ఎన్నికలలో ఓటమి చెందిన బి ఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందటనే పాడి కౌశిక్ రెడ్డికి పరోక్షంగా అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశారు. ఈ సందర్భంగా జరిగిన వేలాదిగా ప్రజలు పాల్గొన్న సభలో కౌశిక్ రెడ్డిని ఆశీర్వదించాలని ఈ ఎనిమిది నెలలు రాత్రింబవళ్లు ప్రజల మధ్యనే ఉండాలని గ్రామాలలో బస చేయాలని మంత్రి కోరారు. కేటీఆర్  కౌశిక్ రెడ్డికి ఇచ్చిన హామీతో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన వాది, గెల్లు శ్రీనివాస్ అవాక్కయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా  రాజకీయాలలో పెను మార్పులు సంభవించే దిశలో ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దాసరి మనోహర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలలో రెడ్ల ప్రాతినిధ్యంగా పెద్దపల్లి ఒకటే బి ఆర్ఎస్ కోటలో నిలబడుతుంది. పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారవడంతో హుజురాబాద్ తో పాటు పెద్ద పెళ్లికి కూడా మరో మారు రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తారా లేక కోత విధిస్తారా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో బి ఆర్ఎస్ పార్టీలో రెడ్డి శాసనసభ్యుల సంఖ్య 35 పైగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బి బి ఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వెనుకబడిన తరగతులకు బి ఆర్ఎస్ లో ప్రాతినిధ్యం లేదని అపోహ ఉంది. ఈ మారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వెనుకబడిన వర్గాల వారికి అధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు పార్టీ సుముకుతగా ఉంది. ఈ నేపాధ్య దృష్ట్యా పెద్దపల్లి అసెంబ్లీ స్థానం ప్రస్తుతం శాసనసభ్యులుగా కొనసాగుతున్న దాసరి మనోహర్ రెడ్డి కే అవకాశం ఇస్తారా? లేదా ఇతర అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారా అనేది సందిగ్ధంలో ఉంది. తిరిగి సెట్టింగ్లకే శాసనసభ్యులుగా మరోసారి అవకాశం కల్పిస్తామని కెసిఆర్ వ్యాఖ్యలపై దాసరి మనోహర్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బి ఆర్ఎస్ ఆశావాహుల్లో హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం స్పష్టం అవడంతో జూలపల్లి జెడ్పిటిసి కెసిఆర్ సేవాదళ ఉపాధ్యక్షులు రాష్ట్ర పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షులు బొద్దుల లక్ష్మణ్ ముందు వరుసలో ఉన్నారు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి కెసిఆర్ సన్నిహితుడుగా ఈ మారో టికెట్ తనకే వస్తుందని గత నాలుగు సంవత్సరాల నుండి స్వచ్ఛంద సేవ ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు మంత్రి కేటీఆర్ ద్వారా పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ పొందేందుకు నల్ల మనోహర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఇటీవల నిర్వహించిన పలు సర్వే లలో  పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి పనితీరు మస్కబారిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 20 శాసనసభ సభ్యులు మార్చాలని చెప్పిన నియోజకవర్గం పేర్లలో పెద్దపల్లి ఒకటిగా ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఊహించని రాజకీయ మలుపు తిరుగుతున్న పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఈ మారు బలహీన వర్గాలకు టికెట్ వస్తుందని వారికే చాన్స్ ఇవ్వాలని  బి ఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తుంది. బొద్దుల లక్ష్మణ్, నల్ల మనోహర్ రెడ్డి లా మధ్య టిఆర్ఎస్ టికెట్ పోరు రసవత్తరంగా సాగుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking