వంజరి కుల పెద్దలు, యువనాయకులు మహిళ సోదరీ మణులు అధిక సంఖ్యలో కదలిరండి: వంజరి యూత్ కమీటి వైస్ చైర్మన్ కరిప అనిల్ కుమార్ వంజరి

 

02 ఫిబ్రవరి హైదరబాద్ (ప్రజాబలం హబ్సిగూడ) : వంజరి ఆత్మగౌరవ భవనం భూమి పూజకు వంజరులు అందరు భారి సంఖ్యలో రావాలి అని పిలుపునిచ్చిన రాష్ట్ర వంజరి సంఘం యూత్ కమిటి వైస్ చైర్మన్ కరిపె అనిల్ కుమార్ వంజరి గారు. ఈ సందర్బంగ వంజరి యూత్ వైస్ చైర్మన్ కరిపె అనిల్ కుమార్ వంజరి మాట్లాడుతు ఉప్పల్ భగాయత్ లొ మన కులానికి తెలంగాణ ప్రభుత్వం కెటాయించిన ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి రాష్ట్ర సంఘం ఈ నెల 04 ఫిబ్రవరి ఉ.10:29 నిమిషములకు జరుపు భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్రంలో వున్న వంజరి కులస్తులు , పెద్దలు, మహిళలు మరియు యువతీ యువకులు అధిక సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలో వున్న యువతీ యువకులు అందరు గుర్తించుకొవాలి వంజరి కులానికి జరిగె ప్రతి అభివ్రుద్ది కార్యక్రమం వలన కలిగే ప్రయోజనాలు భవిష్యత్తులో ఇప్పటి యువత అనుభవించడానికే ఇప్పడు. ఈ పెద్దలు చేస్తున్న క్రుషి. కావున యువతీ యువకులు వంజరి కులం కొరకు జరిగె ప్రతి అభివ్రుద్ది కార్యక్రమంలొ పెద్ద ఎత్తున పాల్గొనండి. అన్ని విషయాలు తెలుసుకొండి మన హక్కుక గురించి మన సమష్యల గురించి మనలో యూనిటి లోపం వలన కలిగె నష్టం గురించి మన అభివ్రుద్ది గురించి ఇలా అన్ని విషాయాలపైన అవగాహన పెంచ్చుకొవలసిన అవసరం ఎంతైన వుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం అధ్యక్షుడు కాలేరు నరేందర్ వంజరి, ప్రధాన కార్యదర్శి కాందారి వెంకటేశం వంజరి, కోశాదికారి కాలేరు అమరెందత్ వంజరి తో సహా పూర్తి కార్యవర్గం, జిల్లలలో వున్న కార్యవర్గం సభ్యులు, అన్ని అనుబంద కమిటీలు వాటి సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లూ పాల్గొననున్నారు కావున రాష్ట్రంలో వున్న వంజరులు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking