హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో రమాబాయి అంబెడ్కర్ జయంతి,

 

చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు

రమాబాయి అంటే త్యాగం

సంగారెడ్డి ఫిబ్రవరి: 7 ప్రజ బలం ప్రతినిధి- భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబెడ్కర్ సతీమణి రమాబాయి అంబెడ్కర్ జయంతి సందర్భంగా ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ ఉపాధ్యక్షులు అఖిల్ మాట్లాడుతూ మాత రమాబాయి ప్రపంచ మేధావిని తీర్చిదిద్ది దేశానికే దిపమయ్యారని అన్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఒక్కొక్క మెట్టు వెనుక రమాబాయి ఉంటుందని అన్నారు. బాబా సాహెబ్ ఉన్నత చదువుల కోసం తాను ఎన్నో భాదలను అనుభవించిందని, ఒక్కొక్కరుగా తన బిడ్డలు రాలిపోతున్న మొక్కవోని ధైర్యంతో రామబాయి ఎంతటి భాదనైన తన గుండెల్లోనే దాచుకొని బాబా సాహెబ్ కి ధైర్యాన్ని నూరిపోసినరాని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రఘు, శ్రీకాంత్, సంతు, అభి, అనిల్, దినేష్, మణి గౌడ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking