బీసీ కులాలన్నింటికి లక్ష మంజూరు వర్తింపజేయాలి

ఎం పి ఆర్.కృష్ణయ్య ను కలిసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ
హైదరాబాద్ జూన్ 12 ();రాష్ట్ర ప్రభుత్వం బీసీ చేతివృత్తుల వారికి 100% మాఫీతో లక్ష రూపాయల మంజూరి చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ జాతీయస్థాయిలో అగ్రవర్ణాల పేదలకి రిజర్వేషన్ కల్పించినట్లుగా, బీసీల్లో కులాల్లోని బీదలను గుర్తించి లబ్ధిదారులందరికీ కూడా లక్ష రూపాయల పథకం మంజూరి చేయడానికి ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు బిసి భవన్ లో రాజ్య సభ సబ్యులు ఆర్. కృష్ణయ్య ను కలిసి వినతి పత్రం సమర్పించారు.అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ బీసీ కులాల్లో చేతివృత్తుల వారికి ఇచ్చే లక్ష రూపాయల మంజూరు పథకం దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ప్రకటించిన 14 కులాలకే కాకుండా మిగతా బీసీ కులాలకు కూడా ఈ పథకం వర్తింపజేయాలి. అలాగే గత ఎన్నికల్లో కూడా బీసీ కులాలకు రుణాలు ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్ళిన ప్రభుత్వం అప్పటి 5 లక్షల 77 వేల దరఖాస్తుదారులకు కూడా అప్పటి హామీ ప్రకారం సబ్సిడీ రుణాలు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అందజేసి బీసీల అభివృద్ధి పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు. గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా “బీసీ బందు” పథకాన్ని కూడా వెంటనే అమలు చేయాలని, వివిధ కుల సంఘాలకు రాష్ట్ర రాజధాని లో ఆత్మగౌరవ భవనాల పేరా కేటాయించిన స్థలాల్లో సత్వరమే నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking