10వ డివిజన్ నందు సుడా నిధులు రూ. 20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 17 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ 10వ డివిజన్ నందు 20 లక్షల తో నిర్మించబడిన సిసి రోడ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు అనంతరం నూతనంగా నిర్మించిన చైతన్య నగర్ ఆర్చ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం నగరంలో అవసరమైన మేర అన్ని రోడ్లను సిసిలు గా మార్చగలిగామని అన్నారు. ఇప్పటి వరకు కార్పోరేషన్ పరిధిలో రూ.12 కోట్ల సుడా నిధులతో 173 రోడ్లు వేశామని ఆయన తెలిపారు. ప్రజా అవసరాల మేరకు కార్పోరేషన్ పరిధిలో ఇంకా అవసరం అయిన చోట మరిన్ని రోడ్లు, డ్రెయిన్లు వేస్తామని, ముఖ్యంగా ముందుగా డ్రైన్స్ పై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ చావా మాధురి నారాయణరావు, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మున్సిపల్ డిఇ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking