ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 30 :
మందమర్రి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం యూనియన్ 105 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ హాజరై ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆవిర్భవించి 105 సంవత్సరాలు గడిచాయని అన్నారు. యూనియన్ కోసం ఎందరో నాయకులు ప్రాణ త్యాగాలు చేసారని కొనియాడారు. కార్మిక రంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కార్మిక హక్కులు సాధించిన ఘనత ఏ.ఐ.టీ.యూ. సి కే దక్కుతుందన్నారు. యూనియన్ బలోపేతానికి యువతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ యూనియన్ సింగరేణి కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
ఈకార్యక్రమంలో
వైస్ ప్రెసిడెంట్
భీమానాధుని సుదర్శన్,
జాయింట్ సెక్రటరీ
కంది శ్రీనివాస్, పి. బాణయ్య,
టేకుమట్ల తిరుపతి,
ఫిట్ కార్యదర్శులు
గాండ్ల సంపత్,
శర్మ, కల్వల శ్రీనివాస్, కుమార్, ఓదెలు, మేకల సంతు, పంగ చంద్రశేఖర్, పారిపల్లి రాజేశం, వేణు, భూమయ్య, కాసం సమ్మయ్య, కొండయ్య,
చందు, భగవాన్ రెడ్డి లు పాల్గొన్నారు.