జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : జిల్లాలోని ఈనెల 18 నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు జరుగనున్న 10 వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో 10 వ తరగతి పరీక్షల నిర్వహణ కొరకు జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,ఉదయం
9 :30 గంటల నుండి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని,
9 వేల 637 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ కొరకు అధికారులు అవసరమైన సిబ్బందిని,నియమించడం జరిగిందని,ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల తరలింపుకు బందోబస్తు ఏర్పట్లతో పాటు పరీక్షలు ఎలాంటి మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా ప్రతిష్ట మైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశామని విద్యార్థులు ఉదయం 9 గంటల పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, హాల్ టికెట్లు ను ఆన్ లైన్ bsc.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని.వార్షిక పరీక్షల విషయంలో ఏమైనా సందేశాలు ఉన్నట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 7032463114,లో సంప్రదించవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నిబంధన మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సకలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్.టి.సి. ద్వారా సమయం అనుకూలంగా బస్సులు నడిపించడం జరుగుతుందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు మూత్రశాలలు పరిశుద్ధం నిరంతరం విద్యుత్ సరఫరా సౌకర్యాలు కల్పించడంతోపాటు అత్యవసర సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.పరీక్ష కేంద్రానికి మొబైల్స్ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదని తెలిపారు.