జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సబావత్ మోతిలాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : 2024 -2025 విద్యా సంవత్సరానికి గాను జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ద్వారా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి లో ప్రవేశానికి అర్హత గల విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచారకులు పోటు రవీందర్ రెడ్డి తో కలిసి డ్రా పద్ధతిన విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…షెడ్యూల్డ్ కులముల కు చెందిన విద్యార్థిని,విద్యార్థులు ఉచిత విద్యాభ్యాసానికి 1 వ తరగతిలో ప్రవేశాలకు జిల్లా నుండి ఇద్దరు విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగిందని, హాజీపూర్ మండలం పడ్తనపల్లికి చెందిన కాంపల్లి సాయి సహర్ష,కోటపల్లి మండల కేంద్రానికి చెందిన కొంకటి ఆరాధ్య లు ఉన్నారని,వెయిటింగ్ లిస్టులో మందమర్రి కి చెందిన కాదాసి సుహాన్,చందారం కు చెందిన గొగర్ల సెలెన మహాంతి ఉన్నారని తెలిపారు.జిల్లాకు రెండు సీట్లు కెట్టాయించగా 32 మంది దరఖాస్తులు అందాయని, ఇందులో 26 మంది డ్రాకు ఎంపిక కాగా 6 దరఖాస్తులు తిరస్కరించడం జరిగింది అని తెలిపారు.ఎంపికైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని చక్కగా చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు,విద్యార్థులు, తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.