రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక…

 

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి మార్చి 15

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరిగింది. పాత కార్యవర్గం యొక్క కాల పరిమితి ముగిసినందున, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడుగా దాసరి రాజేశ్వరరావు, కార్యదర్శిగా మొహమ్మద్ మొయినుద్దీన్, కార్యనిర్వాహక అధ్యక్షుని గా టీ వెంకటస్వామి, సంయుక్త్య కార్యదర్శిగా శీలం మల్లేశం, సహాయ కార్యదర్శులుగా ఏం పరశురాములు, జి మొగిలి, బి సమ్మయ్య, డి సారంగపాణి, ఎస్ రామచందర్, ఎస్ రాజయ్య కోశాధికారిగా బి విద్యాసాగర్ సహాయ కోశాధికారిగా ఎండి ఖాదర్ ఖాన్ గౌరవ సలహాదారులుగా జి చంద్రయ్య, పి మాణిక్యాలరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 80 మంది సభ్యులు హాజరైనారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు దాసరి రాజేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే పెన్షనర్స్ అందరికీ అందుబాటులో ఉంటానని, వారికి కావలసిన మౌలిక సదుపాయాలు, బ్యాంక్ కార్యకలాపాలు గాని రైల్వే ఆసుపత్రిలో వైద్య సేవల విషయంలో గానీ తాను అందుబాటులో ఉండి సభ్యులందరికీ సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఈ సందర్భంగా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking