రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 మార్చ్ 2024:
మణికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాయంత్రం స్కూల్ సమయానంతరం అదనపు తరగతులకు హాజరయ్యే పదవ తరగతి 206 మంది విద్యార్థులకు గత మండలం రోజులుగా అందరి సహాయ సహకారాలతో వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారు అల్పాహారం అందించడం విశేషమని, చివరి రోజున అరటి పండు, హల్డిరాం భేల్ అల్పాహారంగా సమకూర్చడం జరిగినదని వ్యవస్థను చూస్తున్న మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియపర్చుతు సమయాను కూలంగా తమకు తోచిన విధంగా రక రకాల సహాయ సహకారలన్దించిన సహచర ట్రస్టు సభ్యులకు, గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ వరిష్ఠ నాగరికుల సంఘ సభ్యులకు, నార్సింగీ రోడ్ లో కల స్కైలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నివాసులకు, అన్ని విధాలా సహకరించిన ఊరి పెద్దలకు, ఆల్ కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాలకు, మనసున్న మారాజులైన దాతలందరికీ, పాఠశాల ప్రధానోపాధ్యాయునికి, ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతాభీ వందనములు తెలియ పరుస్తూ ఈ సంవత్సరపు పాఠశాల చివరి రోజైన శనివారం 16వ తేదీన 9వ తరగతి మరియూ పదవ తరగతి విద్యార్థులు దరిదాపు 450 మందికి వీడ్కోలు సందర్భంగా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్న గ్రామ పెద్ద బీ.ఆర్.ఎస్ పార్టీ ఫ్లొర్ లీడర్ రామకృష్ణ రెడ్డి మరియు హానీ వెల్ ఐ.టీ కంపనీ రామమ్, సంఘ సేవకుడు శ్రావణ్ లకు వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు సభ్యుల తరపున మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు కృతఙ్ఞతలు తెలుపుతూ మున్ముందు కూడా విద్యార్థుల సహాయార్థం సహాయ సహకారాలందిస్తారని ఆశా భావం వ్యక్త పరిచినారు.

