16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి, మంత్రులకు పాలాభిషేకం._

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 14

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రణవ్ ఆదేశాల మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెపు సారంగపాణి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ ,బలహీన వర్గాలను గుర్తించినందుకు ముఖ్యమంత్రి, మంత్రులకు జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న, పూదరి రేణుక శివకుమార్, సుంకరి రమేష్, ఎగ్గని శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సజ్జు, ఎండి ఇమ్రాన్, ప్రశాంత్ (సన్నీ)దొడ్డె నవీన్, మంద అశోక్ ,సూర్య, రవి, సురేష్ ,బండి మల్లయ్య, పాపిరెడ్డి, సాంబయ్య, తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking