12 లక్షల దేవాదాయశాఖ నిధులతో పోచమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 23 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లోని ద్వారక గ్రామం లో 12 లక్షల దేవాదాయశాఖ నిధులతో పోచమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అనంతరం దండేపల్లి మండలంలోని కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువతి కుదురుపాక మౌనిక వివాహ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు పెళ్లి ఖర్చుల నిమిత్తం 10,000/-రూపాయల ఆర్థిక సాయం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ అనిల్,పిఎసిఎస్ చైర్మన్ తిప్పని లింగన్న,మండల అధ్యక్షుడు చించు శ్రీనివాస్,సర్పంచులు,ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు,మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం జెండ వెంకటపూర్ గ్రామం లో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతూ తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నారు.