ఈ నెల 25 న కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 130వ జయంతి వేడుకలు

హైదరాబాద్ ఆగష్టు 7 ();ఈ నెల 25 న నగర మాజీ మేయర్ స్వర్గీయ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 130వ జయంతి సందర్భంగా, తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి యాదగిరి ముదిరాజ్ ఆధ్వర్యంలో అంబర్ పేట నియోజకవర్గం లోని అలీ కేఫ్ లో గల సత్య కమల ఫంక్షన్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జయంతి వేడుకలకు సంబందించిన బ్రోచేర్ ను ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి యాదగిరి ముదిరాజు మాట్లాడుతూ నగర మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఈనెల 25న ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి ఒక్క ముదిరాజ్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలిరావాలని, ముదిరాజులు ఐక్యమత్యంగా ఉండలని, అంబర్ పేట నియోజకవర్గం లో కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తూర్పు రామచందర్ ముదిరాజ్, బాలరాజు ముదిరాజ్, సతీష్ ముదిరాజ్, చింతల నవీన్ ముదిరాజ్, శ్రీరాములు ముదిరాజ్, రోహిత్ ముదిరాజ్, డొప్ప అంజయ్య ముదిరాజ్,మహేష్ ముదిరాజ్,యాదగిరి ముదిరాజ్,సుదర్శన్ ముదిరాజ్,నాగేష్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking