ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 13వ వర్థంతి

– తాత ఆశయాలను కొనసాగిస్తా.
– వర్థంతి సందర్భంగా మహిళా ప్రభుత్వ పాఠశాలకు వాటర్ పూరిఫయిర్ అందజేత.
– నిరుపేద కుటుంబానికి చెందిన పేద విద్యార్థినిని ఎంబిబిఎస్ చదివిస్తున్న ప్రణవ్.

హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూలై 24

రాజకీయ దురంధరుడు, స్నేహశీలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని, వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానలు పొంది వారికి సేవ చేస్తాననీ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు,మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు ఆరపల్లి మోహన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడిగిన వారికి లేదనకుండా సహాయం చేయడమే కాకుండా,పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావొద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని,ఆనాటి ప్రధానమంత్రి పి.వీ.నరసింహరావు కు చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన వంతు సహాయం చేశారని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు.తాత వారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ మహిళా పాఠశాలకు ఉచితంగా వాటర్ ప్యూరిఫైర్ అందించారు.తన స్వగ్రామమైన సింగపూర్ కు చెందిన నిరుపేద అమ్మాయి వేల్పుకొండ సంజీవని గత సంవత్సరం ఎంబిబిఎస్ లో మంచి ఉత్తీర్ణత సాధించగా సిద్ధిపేట గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చింది.తాత పేరు మీద విద్యకు అవసరం అయ్యే ఆన్ని ఖర్చులను ప్రణవ్ భరిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ దవాఖానలోనీ రోగులకు ఉచితంగా పండ్లు పంపిణీ చేశారు. విద్య, వైద్యం, పేదలకు సేవ చేయడంలో మరింత ముందు ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర రావు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking