ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 24 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ – పరిపాలన పరమైన నిర్ణయాలలో భాగంగా, ఇంతవరకు కొనసాగిన రీజినల్ కోఆర్డినేటర్ కార్యాలయాల స్థానంలో జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా,ఇప్పటివరకు ఆదిలాబాద్ రీజియన్ రీజినల్ కోఆర్డినేటర్ గా కొనసాగిన కొప్పుల స్వరూపారాణి స్థానంలో,కాళేశ్వరం జోన్-1జోనల్ అధికారిగా హెచ్. అరుణకుమారి నియమితులయ్యారు. ఇంతవరకు రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసిన కొప్పుల స్వరూపారాణి జోనల్ ఆఫీసర్ గా ఖమ్మం – భద్రాద్రి జోన్ కు బదిలీ అయినారు.కాళేశ్వరం జోన్-1 పరిధిలో ఉన్న కొమరంభీం-ఆసిఫాబాద్ జిల్లా,మంచిర్యాల జిల్లా,పెద్దపల్లి జిల్లా, భూపాలపల్లి జిల్లా మరియు ములుగు జిల్లాలలోని గురుకుల పాఠశాలలపై పర్యవేక్షణాధికారిగా కొత్త జోనల్ అధికారి హెచ్ అరుణ కుమారి కొనసాగనున్నారు.