15రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు.

మద్దికెర: మండల పరిధిలోని ఎడవలి, బసినేపల్లి గ్రామాలలో15 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవోపీఆర్డీ మద్దిలేటి స్వామి తెలిపారు.బుధవారం మద్దికెరలోని ఎంపిడిఓ కార్యాలయం నందు మనం మన పరిశుభ్రతపై మండల స్థాయి అధికారులతో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో నరసింహ మూర్తి మాట్లాడుతూ మనం-మన పరిశుభ్రత ఫేజ్-2 కింద బసినేపల్లి,ఎడవల్లి గ్రామాలలో 15 రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులను చేపట్టి చివరి రోజైన 21వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా గ్రామ ముఖ్యులతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.ఈ సమావేశంలో డిప్యూటీ తాసిల్దార్ ఇజాజ్ అహ్మద్, వైద్యాధికారి సమరసింహా రెడ్డి,ఏపీవో రవీంద్ర,ఏ పీ ఎం సూర్యప్రకాష్,ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌభాగ్య లక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు శ్రీహరి,సాలేహా బొకారియా తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking