సావిత్రి బాయి పూలే ఆశయాలను కొనసాగిస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వం సావిత్రి బాయి పూలే జయంతి అధికారికంగా జరపడం అభినందనీయం
అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 03 : చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తామని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తోగరు రాజు అన్నారు.శుక్రవారం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సావిత్రిబాయి పూలే జయంతిని నాయకులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశంలో మొట్టమొదటి సారిగా మహిళలకు, దళితులకు, గిరిజనులకు,వెనకబడిన తరగతులకు అందరికీ విద్య అందించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అన్నారు. బాలిక విద్య, వితంతు విద్య, కోసం ఎన్నో పాఠశాలల నెలకొల్పిందన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చొప్పదండి రమేష్,బైరం లింగన్న,జిల్లా నాయకులు మాలెం చిన్నన్న, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, చాతరాజు రాజేష్,మామిడి సన్నీ, కండె మొగిలి,అడ్లురి శివ,బానేష్ మేకల,మినుముల వేణు,మంచాల కుమార్,మొగిలి,ప్రదీప్,జోసెఫ్ , చుంచు సతీష్,నవీన్ తరులు పాల్గొన్నారు.