సావిత్రి భాయి పూలే సంఘసంస్కర్త, ఆదర్శ మహిళ.
సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్.
తూప్రాన్, జనవరి, 3. ప్రజాబలం ప్రతినిధి :-
మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తూప్రాన్ లో భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్,నాగరాజ్ యాదవ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు మహిళల అభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. సావిత్రిబాయి పూలే సామాజిక సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే సతీమణి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని మరియు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్,మచ్చ యాదగిరి ,గడ్డం ప్రశాంత్ కుమారు మాట్లాడుతూ ఈ రోజు మహిళలకు చాలా శుభదినం. మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతిని మహిళా దినోత్సవం గా జరుపుకోవడం వల్ల మనము ఆమెకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము కాబట్టి మహిళా దినోత్సవం గా జరుపుకోవడం ద్వారానే మనం ఆమెకు నిజమైన నివాళులు అర్పించడం జరిగిందనీ తెలిపారు. మహిళా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బండ నాగరాజు యాదవ్ గడ్డం ప్రశాంత్ కుమార్, మచ్చ యాదగిరి,జైపల్ రాథొడ్, గడ్డమీది నాగరాజు గౌడ్ , జిడిపల్లి బాలయ్య వివిధ కుల సంఘల నాయకులు,ప్రాజప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.