గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 03 జనవరి 2025
మాజి మంత్రిణి, ప్రస్తుత మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిని, భారత రాష్ట్ర సమితి రాజేంద్ర నగర్ ఇంఛార్జి, రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలవడానికి మణికొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆద్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వెళ్ళడం జరిగినదని, ఈ సందర్భముగా రాబోయే అన్నీ ఎన్నికలలో బీ.ఆర్.ఎస్ పార్టీ గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని కార్యకర్తలకు పిలుపునిస్తు రానున్న పంచాయతీ ఎన్నికలతో పాటు కౌన్సిల్ కానీ కార్పొరేషన్ ఎన్నికలకు గాని స్థానిక నాయకులు సంసిద్దులుగా ఉండాలనీ అందు నిమిత్తం ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా ఎల్ల వేళలా మేముంటామని హామీ ఇచ్చారని, పార్టీ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో పాలు పంచుకొంటూ ప్రజా సౌకర్యార్థం ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని సీతారాం ధూళిపాళ తెలుపుతూ, ఈ కార్య క్రమంలో ధనరాజ్, రూపా రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, అందె లక్ష్మణ్ రావు, ఉపెండర్నాథ్ రెడ్డి, విజయ లక్ష్మి, రాంసుబ్బా రెడ్డి, ఆరీఫ్ మొహమ్మద్, టోనీ, జై, శ్రీధర్, సుమ, రేఖ, కృపాకర్, రవి, అనూష, మంజు, అన్షు, గుట్టమిది నరేందర్, విఠల్, మాల్యాద్రి నాయుడు, కిరణ్ తది తరులు పాల్గొన్నారు.