ప్రతి బూత్ నుంచి 200 సభ్యత్వం తగ్గకూడా నమోదు చెయాలి

జిల్లా సభ్యత్వం నమోదుల ఇంచార్జీ ఎనగందుల కృష్ణ మూర్తి

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ సెప్టెంబర్ 28: లక్షెట్టిపేట మండల సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం మండల అధ్యక్షలు బొప్పు కిషన్ అధ్యక్షతన నిర్వహించారు, బీజేపీ దేశ వ్యాప్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలల వారీగా సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు,ప్రతి బూత్ లో సభ్యత్వం 200 మంది సభ్యులకు తగ్గకుండా నమోదు రావాలని సభ్యత్వం నమోదుల జిల్లా కన్వీనర్ ఎనగందుల కృష్ణమూర్తి పేర్కొన్నారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ…దేశ వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు సభత్వ నమోదు కు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మండలాలు,గ్రామాల వారీగా ప్రజలలో అవగాహనా కల్పించి సభత్వ నమోదును విజయవంతం చేయాలనీ కోరారు.గ్రామ పంచాయితీ ల్లో నిధులు లేక పోవడం గ్రామాల్లో పారిష్యుద్ద సమస్యలు ఎక్కువై ప్రజలు అంటూ వ్యాధుల భారీన పడుతున్నారని వెంటనే గ్రామ పంచాయితీ ల అభివృద్ధి కీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు బొప్పు కిషన్,ప్రధాన కార్యదర్శి హేమంత్ రెడ్డి,వెంకటేష్, సతీష్,చిన్నన్న,ముదం మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking