2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్

 

ప్రజ బలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 15:
డీఎస్సీ 2008 రిక్రూట్మెంట్ నందు హైకోర్టు ఆదేశానుసారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు 20 మంది అభ్యర్థులు కేటాయించడమైనది,వారిలో 19 మంది అభ్యర్థులు తెలుగు మీడియం కు చెందిన వారు కాగా ఒకరు ఉర్దూ మీడియం నకు ఎంపిక చేయబడినారు. అదేవిధంగా పాఠశాల విద్యా సంచాలకులు తెలంగాణ హైదరాబాద్ వారి ఆదేశానుసారము జిల్లాలో గల గ్రామీణ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను వారికి మెరిట్ ఆధారంగా కౌన్సిలింగ్ ద్వారా తాత్కాలికంగా కాంట్రాక్టు ఉద్యోగ నియామక పత్రాలు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking