సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్భూ గుప్తా
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 15 : జిల్లాలోని క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్భూ గుప్తా అన్నారు.శనివారం క్యాతన్పల్లిలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో ఎ.పి.ఓ. పి.వి.టి.జి.మనోహర్, ఎ.టి.డి.ఓ.పురుషోత్తం, నాయక్ పోడ్ సంఘం ప్రతినిధులతో కలిసి పాల్గొని కాలభైరవ స్వామి,మైసమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ… గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను అధికారులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలని తెలిపారు.జాతరలో పారిశుద్ధ్యం, భక్తులకు త్రాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని,గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు భోజన ఏర్పాట్లు చేయాలని, వైద్య -ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి అత్యవసర వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఆదివాసీ సంఘాల నాయకులు, జాతర కమిటీ ప్రతినిధులు అధికార యంత్రాంగానికి సహకరిస్తూ జాతర ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగే విధంగా సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.