భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

బజరంగ్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ లక్ష్మణ్‌ రావు
్గగోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: దేవాలయాల భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బజరంగ్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ లక్ష్మణ్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గోషామహల్‌ నియోజకవర్గంలోని దూతరీ మాట్‌ టెంపుల్‌ (షాహినాథ్‌ గంజ్‌ )
మహాదేవ్‌ టెంపుల్‌ (ఫీల్‌ ఖానా)
మహాలక్ష్మి టెంపుల్‌ (ఫీల్‌ ఖానా)
ఒక్కో దేవాలయాలకు సంబంధించిన భూములను భూకబ్జాదారులు ఆక్రమించి 1100 గజాల నుండి 2000 గజాలను అమ్ముకోవడం జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్‌ తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking