మణికొండలో కె.సి.ఆర్ పుట్టిన రోజు సంబరాలు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 16 ఫిబ్రవరి 2025
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వెలసిన ఫ్లెక్సీలలో రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఆయుర్ ఆరోగ్యాలతో విరాజిల్లుతూ మళ్లీ ముఖ్య మంత్రి పదవిని చేపట్టాలని మనసా వాచా ఆశాభావాన్ని వ్యక్త పరచడం జరిగినదని మణికొండ పార్టీ తరపున అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ చేయడం జరిగినది. ఈ సందర్భముగా కె.సి.అర్ గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం కొరకు ముందుగానే తెలంగాణ ప్రజలందరు ముక్త కంఠంతో సారె కావాలి మళ్ళి సారె సి.ఎం గా రావాలనే ఆకాంక్షతో భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు తెలియ పరుస్తూ బ్యానర్ లు వేసి జన్మదిన శుభ సందర్భముగా సోమవారం 17 ఫిబ్రవరి రోజున ఉదయం 10 గంటలకు పంచవటి కాలనీ లోని రోడ్డు నంబర్ 10 లో గల శివాలయంలో పూజాదికాలు జరిపించి 11 గంటలకు పైప్ లైన్ రోడ్డులో గల రేణుకా ఎల్లమ్మ గుడివద్ద కేక్ కట్టింగ్ మరియు టపాకాయలు పేల్చడంతో సంబరాలు మొదలు పెట్టి మిఠాయిలు పంచిపెడుతూ మధ్యాన్న్నం 12 గంటల తరువాత అన్న ప్రసాద వితరణ జరుపడానికి సన్నాహాలు చేయడం జరిగినదని తెలియ పరచినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking