ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అక్టోబర్ 25:కేంద్ర ప్రభుత్వ పాడి, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 21వ అఖిల భారత పశు గణన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు ప్రారంభించారు. ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు నిర్వహించనున్న కార్యక్రమంలో పాడి పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు మరియు కోళ్లు ఇలా 16 రకాల జంతువుల లెక్కను పక్కాగా సేకరించనున్నారు.
ప్రతి ఐదేళ్లకోసారి దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో తాజా లెక్కలను కచ్చితంగా ఘణనను. చేయడానికి జిల్లా వ్యాప్తంగా సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నారు.
పశుసంవర్ధక శాఖ అధికారులు సిబ్బందితోపాటు గోపాల మిత్రులు ఇతర ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా ఈ గణనలో వినియోగించనున్నారు. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను చేపట్టారు.
గ్రామ మరియు పట్టణ స్థాయి నుంచి ఇంటింటిని సందర్శించి పాడి పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు కుక్కలు ఇలా 16 రకాల పెంపుడు జంతువుల వివరాలు సేకరించనున్నారు వివరాలను పక్కాగా నమోదు చేయడానికి సిబ్బంది ఇంటింటికి వస్తారు. కావున ప్రజలందరూ సహకరించాలి.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. టి. సుధాకర్ మరియు సహాయ సంచాలకులు డా. జి. ప్రభు రాజు గార్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.