రోడ్ ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : రోడ్డు భద్రతపై కమీషనరేట్ స్థాయి సమావేశం రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నివారణ చర్యలపై రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్ అధ్యక్షతన రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పరిధిలోని పోలీస్ శాఖ,రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, రవాణా శాఖ,నేషనల్ హైవే రహదారికి సంబంధించిన అధికారులు మరియు ఇతర ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో రోడ్ ప్రమాదాలు జరగకుండా తిసుకోవాల్సిన ముందస్తు చర్యలు, నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.సిపి సందర్భంగా మాట్లాడుతూ… రామగుండము కమీషనరేట్ పరిది పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల పరిదిలలో లలో రహదారులపై జరుగుతున్న రోడ్ ప్రమాదాలను నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అధికారులు పటిష్టమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రామగుండము పోలీస్ కమీషనర్ ఆదేశించారు.రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదని, మానవ తప్పిదాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రమాదాలలో 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా చనిపోతున్నారని, వీటిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవే 63,363, స్టేట్ హైవే 01,155,24,15, ఇతర రోడ్లపై పై పోలీస్ శాఖ అధికారుల ద్వారా కనుగొన్న బ్లాక్ స్పాట్ల వద్ద పోలీస్,ట్రాఫిక్ అధికారులు,ఇతర సంబందిత అధికారులతో కలిసి స్పాట్స్ సందర్శించి ప్రమాదాలకు సంబందించిన కారణాలు గుర్తించాలి,నివారణ మార్గాలను గుర్తించి పరిష్కార మార్గాల ఏర్పాటుకు కృషి చేయాలి,రేడియం స్టికర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు.రహదారుల పై అవసరమైన చోట వాహన వేగాన్ని నియంత్రించే స్పీడ్ బ్రేకర్స్ లను ఏర్పాటు చేయాలని, కెమెరాలు,లైట్లు,స్పీడ్ కెమెరాలు,జంక్షన్ ల వద్ద,పాదచారులు రోడ్డు దాటే దగ్గర జిబ్రా క్రాసింగ్,లైటింగ్, రోడ్డు రిఫ్లెక్టింగ్ లైట్లు, తమ వాహనం ఎంత వేగంతో వెళ్తున్నది వాహన చోదకున్ని అలెర్ట్ చేసేలా రోడ్లపై వేగాన్ని సూచించే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల సర్వీస్ రోడ్డు వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిపి గారు సూచించారు.సమావేశంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్ అదనపు కలెక్టర్లు అరుణ శ్రీ, Addl.కలెక్టర్, శ్యామ్‌లాల్ జే సీ, అషినల్ డిసిపి అడ్మిన్ రాజు,జిల్లా రవాణా అధికారి రంగారావు,ఎంవీఐ శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ మంచిర్యాల ఏ సి పి ఆర్ ప్రకాష్,జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఎసిపి రవి కుమార్,రామగుండం ట్రాఫిక్ ఏసిపి నరసింహులు,టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి,సిసిఎస్ఏ ఎసిపి వెంకట స్వామి, ఏఆర్ ఎసిపి ప్రతాప్, సుందర్ రావు, డిఎమ్ఎచ్ఓ ప్రమోద్ కుమార్,పంచాయత్రాజ్ ఈఈ.గిరీష్ బాబు,ఆర్ అండ్ బీ డీఈ లింగరాజు, టెక్నికల్ ఆఫీసర్ బాలకృష్ణ,ఎచ్ కె ఆర్ మేనేజర్ రామకృష్ణ, మున్సిపల్ కమీషనర్ పి పి ఐ వెంకటేష్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్-రామగుండం-రాజు ఆర్ టీ సీ డిపో మేనేజర్-జీడికె మంచిర్యాల జిల్లాకు సంబందించిన ఆర్ అండ్ బీ డీఈ మున్సిపల్ మసూద్, ఎంవీఐ రంజిత్ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్దన్ డాక్టర్ కృపా బాయి ప్రోగ్రామింగ్ అధికారి ఎమ్ ఎచ్ ఎన్,తదితర ఆయా సంస్థల,సంబంధిత అధికారులు పి రవి కిరణ్,ఆర్ అండ్ బీ అయి మంచిర్యాల సబ్ డివిజన్,బి భరత్ చెన్నూరు సబ్ డివిజన్ ఆర్ అండ్ బీ ఏ ఈఈ పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, మంచిర్యాల ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై హరి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.