ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అక్టోబర్ 25: పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి సింగారం మరియు పూడూరులో 25.10.20204 శుక్రవారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదనపు జిల్లా కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ సుగుణబాయి మరియు జిల్లా సహకార అధికారి వెంకట్ రెడ్డి హాజరై కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యం దిగుబడిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు రైతు తమ ధాన్యం అమ్మిన 48 గంటలలో నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు తదుపరి సన్న వడ్లు కొనుగోలు సమయంలో ఒకే కేంద్రంలో సన్న వార్డులకు మరియు దొడ్డు వార్డులకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకోవాలని సన్న వడ్లకు గన్నిబాగులపై ‘ఎస్’అనే అక్షరంతో పాటుగా జిల్లా మరియు సెంటర్ కోడ్ ఉండేటట్లు చూసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.సన్న వడ్ల లోడును మరియు దొడ్డు వడ్ల లోడులను వేరువేరుగా రైస్ మిల్లులకు పంపాలని ఆ మేరకు రిజిస్టర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఆయా కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ నియమాల ప్రకారం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా తగు సూచనలు చేశారు.