కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దానిపై దృష్టి పెట్టి హామీలు అమలు పర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్

 

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 25 : మంచిర్యాల లోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఐబీలో లక్షెట్టిపేట బీజేపి పట్టణం, మండలం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపి నాయకులు మాట్లాడుతూ…కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో బీజేపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పై లేని పోనీ ఆరోపణలు చేసి మాట్లాడ్డం సిగ్గు చేటు.దొంగ దొంగ అంటే భుజాలు సర్దుకున్నట్టు ఉంది మీ వ్యవహారం,మరొకసారి బీజేపి పార్టీ పై కానీ రఘునాథ్ పై గాని అనుచిత వాక్యాలు చేస్తే సాహించేది లేదు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవకే అంకితమై ముందుకు పోతున్న వ్యక్తిపై కాగ్రెస్ నాయకులు ఆరోపణలు చెయ్యడం సరికాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దానిపై ద్రుష్టి పెట్టి హామీలు అమలు పర్చాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విరమల హరి గోపాల రావు, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, అధికార ప్రతినిధి బుద్ధి లక్ష్మణ్,జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్,గడిగోపుల చంద్రమౌళి,హేమంత్ రెడ్డి,మోటపలుకుల సతీష్,ఎంబడి వెంకటేష్,ముష్కం గంగన్న,కోమాకుల రవి,రాజ గురువయ్య, సుధాకర్,రాకేష్, ఆనంద్,లకావతీశ్వర్, సిరిమల వెంకటేష్,బిల్లా అనిల్,సారం వినోద్,భూత్ అధ్యక్షుడు,బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking